Deaths of precious ongole bulls అస్తమిస్తున్న ఆశాకిరణాలు

‎ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి
‎ఒంగోలు జాతి గిత్తలు కోల్పోయిన ప్రాబల్యం బల ప్రదర్శన ల ద్వారా తిరిగి సంతరించుకుంటున్న నేపథ్యంలో, ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటాయి అని ఆశిస్తున్న మేలుజాతి గిత్తలు ఆకాశమాతుగ్గా ప్రాణాలు కోల్పోవడం ఒంగోలు జాతి పశుపోశకులను, అభిమానులను విష్మయానికి గురి చేస్తుంది.(Deaths of precious ongole bulls)

‎ఒంగోలు జాతి పశుపోషణ ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని, గిత్తల మీద ప్రేమ ఉన్నా ఎక్కువ మంది రైతులు పోషణ ఆపేశారు.
‎ప్రేమ చావని కొద్ది మంది రైతులు, వ్యయ ప్రయాస లకు ఓర్చి కష్టంగా పోషణ చేస్తున్నారు. అందువల్లే మనం ఒంగోలు గిత్తలను బల ప్రదర్శనల్లో చూస్తున్నాం. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, ఇంత కస్టపడి పశుపోషణ చేస్తున్న విలువైన గిత్తల ఆకశ్మీక మరణాలు రైతులను, అభిమానులను కోలుకోలేని నైరాశ్యం లోకి నెట్టి వేస్తున్నాయి.
‎ఈ మధ్య కాలంలో శివైక్యం చెందిన కొన్ని మేలుజాతి గిత్తల నేపధ్యం ఇక్కడ ప్రస్థావించబడినది.(Deaths of precious ongole bulls)


‎బోరెడ్డి కేశవరెడ్డి గారి సాంబశివారెడ్డి (సాంబ గిత్త)-(Deaths of precious ongole bulls)
‎‎చిన్న వయసు నుంచే ఎంతో ప్రతిభ కనబరుస్తూ బీరం bulls సుబ్రహ్మణ్యశ్వర్ రెడ్డి, s కొత్తూరు, పాణ్యం మండలం, నంద్యాల జిల్లా వారి వద్ద పళ్ళ విభాగం నుంచి సీనియర్ విభాగం వరకు మంచి ప్రదర్శనలు ఇచ్చి ఎంతో పేరు తెచ్చుకున్న సాంబ గిత్తను, బోరెడ్డి కేశవరెడ్డి గారు, పెద్ద కొట్టాల, నంద్యాల జిల్లా వారు సాంబ మరియు ధర్మ గిత్తల జతని అక్షరాలా ₹73 లక్షలకు కొనుగోలు చేసారు.ఎన్నో ఆశలతో మరెన్నో కలలతో మొదలు పెట్టిన ఆ ప్రయాణం 3 నెలలు తిరగకుండానే సాంబ గిత్త మరణం తో ప్రశ్నర్ధకం అయ్యింది.
‎ఇదే యజమానికి సంబందించిన ఇంద్రశేనారెడ్డి అనే గిత్త కేటగిరి లో ఎన్నో రికార్డులు నమోదు చేసి సీనియర్ లో ఆరంగెట్రం చేసి మంచి పేరు తెచ్చుకుంటున్న సమయం లో చనిపోయింది.
‎రైతు పంట నష్టపోతే నష్టపరిహారం అందించే ప్రభుత్వాలు, కన్న కొడుకుల్లాంటి గిత్తలను కోల్పోయిన ఇటువంటి రైతులకు బుజం తట్టి భరోసా ఇస్తేనే, వాళ్లు కోలుకొని ఒంగోలు జాతి పశుపోషణ కొనసాగిస్తారు, లేనిపక్షం లో ఎంతో అనుభవం ఉన్న పశుపోశకులు పోషణ ఆపేస్తే ఒంగోలు జాతి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.‎

ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారి అగ్ని గిత్త

Ongole Bull Race
ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనలు విశిష్టత- The Craze of Ongole Bull Race

‎పెట్టిన పేరును సార్ధకం చేస్తూ అగ్ని గిత్త పళ్ళ విభాగం నుంచి మంచి ప్రతిభ నైపుణ్యం కనబరుస్తూ ప్రతి సైజులో కూడా మంచి బహుమతులు సాధించింది. తన ప్రయాణం లో ఎక్కడా చిన్న తప్పు కూడా చేయకుండా యజమానికి మంచి పేరు తీసుకువచ్చింది. ఎంతో మంది పశుపోశకులు మంచి మంచి ధరలకు అడిగినా, సీనియర్స్ లో ప్రదర్శనలు ఇవ్వాలని ఆ యజమాని అమ్మలేదు.

‎గత రెండు సంవత్సరాలనుండి సరైన జత లేక బల ప్రదర్శనల్లో పాల్గొనలేదు. ఈ మద్యే జత సెట్ చేసి ప్రదర్శన ఇస్తూ కట్టుకు పోగు వేసుకొని లాగుతూ తన పనితనం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది అగ్ని గిత్త.అంతా మంచిగా జరుగుతుంది అనుకున్న తరుణం లో అకశమాత్తుగా అగ్ని గిత్త చనిపోవడం పశుపోశకులను, అభిమానులను దిగ్బ్రాంతి కి గురించేసింది. సుమారు ₹50 లక్షలు విలువైన గిత్తను ఆ సామాన్య రైతు కోల్పోయాడు. చిన్నప్పటి నుండి ఎన్నో ఆశలతో పెంచుకున్న ఆ గిత్త లేని లోటు ఆ యజమానికి ఎవరు తీర్చలేరు.(Deaths of precious ongole bulls)

‎‎RK Bulls వీరసింహ, వీర నరసింహ, సింహ, బీస్ట్-(Deaths of precious ongole bulls)
‎‎ప్రస్తుత కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ జతల మేలుజాతి ఒంగోలు గిత్తలను పోసించి ప్రదర్శనల్లో పాల్గొంటున్న RK Bulls సంస్థ యజమాని అత్తోట రామక్రిష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా.
‎రామకృష్ణ చౌదరి గారు పట్టుదల ఓర్పుతో ఎంతో ఖర్చుకు ఓర్చి ఒంగోలు జాతి గిత్తలను సేకరించి పోసిస్తూ తోటి పశుపోశకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
‎వారి వద్ద మంచి పేరు ప్రాక్యతలు సాధిస్తున్న తరుణం లో గిత్తలు వరసగా మృత్యువాత పడుతున్నాయి. గత సంవత్సర కాలంలోనే కనీషం ₹2 కోట్ల విలువైన గిత్తలను రామకృష్ణ చౌదరి గారు కోల్పోయారు.ఒకటి తరువాత మరొకటి బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నా, భరించలేని ఆ బాధను గుండె నిబ్బరంతో ఓర్చుకుంటూ ఈ రంగంలో కొనసాగుతున్నారు.

ముగింపు

‎ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఒంగోలు మేలుజాతి గిత్తలు అనారోగ్య కారణాల వల్ల ఈ మధ్య కాలంలో చనిపోయాయి. ఇలాంటి విపత్కర పరిస్థితి ఒంగోలు జాతిలో ఒకటి ఉంది అని ప్రభుత్వానికి తెలుసో లేదో కూడా అర్ధం కావట్లేదు. ఒకవేళ ప్రభుత్వానికి తెలిసిఉండకపోతే, తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పశుపోశకుడు మరియు అభిమాని పై ఉంది.
‎రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ రంగం పై ద్రుష్టి సారించి ఒంగోలు జాతి అభివృద్ధి కి తమ వంతు కృషి చేస్తారని కోరుకుంటూ మీ ongolebullrace.com


the great ongole bull
The Great Ongole Bull- బోడిగిత్త

Leave a Comment