The Great Ongole Bull- బోడిగిత్త

the great ongole bull
the great ongole bull

 

ఒంగోలు జాతి చరిత్రలో… ఒక అంతుచిక్కని అద్భుతం!

‎అది దిగ్గజాల మధ్య యుద్ధం నడుస్తున్న సమయం! సీనియర్స్ విభాగంలో ఆధిపత్యం కోసం హేమాహేమీలు తలపడుతున్నారు. ప్రతి company (Farm) తమ మేలుజాతి గిత్తలతో, విజయం కోసం పోరాడుతున్న తరుణం అది.
‎సరిగ్గా అప్పుడే… ఎటువంటి అంచనాలు లేకుండా, నిశ్శబ్దంగా ఒక సాధారణ జత కోర్టులోకి అడుగుపెట్టింది. ఆనాడు ఎవరూ ఊహించలేదు… ఆ జతలోని ఒక గిత్త, ఒంగోలు జాతి చరిత్రలోనే మరే Ongole Bull కు సాధ్యం కాని రీతిలో అలుపెరుగని పోరాటం చేస్తుందని!
‎ఏ గిత్త ఆడనన్ని పందాలు ఆడి… రికార్డులను తిరగరాసి… అసాధారణ చరిత్రను సృష్టించిన ఆ ‘అజేయ యోధుడి’ కథ మీకు తెలుసా?

ఆరంభం (The Great Ongole Bull- బోడిగిత్త):

కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు, గుంపరమాను దిన్నె గ్రామం, సిరివెళ్ల మండలం, నంద్యాల జిల్లా లోని ఒక పశుపోషకుడు మరియు రధసారధి(Rider). చిన్నప్పటి నుండి Ongole Bulls ఒంగోలు జాతి ఫిల్డ్ లో పెరిగిన వ్యక్తి. ఒక మనిషి తన ఏకగ్రత మొత్తం తన ఇష్టమైన పనిపై పెడితె ఎటువంటి విజయాలు సాధించవచ్చో తెలియజేసిన వ్యక్తి.


జత కలియిక :


‎మొర్రి గిత్త శకం ముగిసిన తరువాత ఒక మంచి జత ను సెట్ చేయాలనే సంకల్పంతో భూపాల్ గారు గిత్తల కోసం వెతకడం మొదలు పెట్టారు.
‎ఒక గిత్త విజయనగరం గ్రామం, సిరివెళ్ల మండలం, నంద్యాల జిల్లా లోని పొలాల్లో వ్యవసాయం చేస్తూ కనిపించింది. మంచి గిత్తలను గుర్తించడం లో అప్పటికే నైపుణ్యం సంపాదించిన అన్న గారికి ఆ గిత్తలో భవిష్యత్తు లో రికార్డులు సృష్టించే యోధుడు కనిపించాడు. ఆ గిత్తను ₹75,000 కు కొనుగోలు చేసారు. ఆ గిత్త కొమ్ములు వెనక్కి ఉండడం తో దానిని బోడిగిత్త అని వాడుక బాష లో పిలవడం మొదలుపెట్టారు. అప్పుడు తెలియదు పిలవడానికి ఏ మాత్రం బాగలేని ఆ పేరే ఒక బ్రాండ్ అవుతుందని.

‎ఆ బోడిగిత్త అనుకున్న విధంగా పనిలో బాగుండడంతో దానికి మంచి జత కలపాలని
‎నరసింహులు గారు, గొల్లపల్లి గ్రామం, దువ్వూరు మండలం, కడప జిల్లా వారి నుండి ఒక గిత్తను   ₹5, 00,000 లకు కొనుగోలు చేసారు. ఆ గిత్త సైజ్ చిన్నగా ఉండడంతో బుడ్డ గిత్త అని పిలిచేవారు.
‎ప్రస్థానం:
‎రెండిటిని జత చేసి శిక్షణ ఇచ్చి న్యూ కేటగిరి విభాగం లో మొదటగా 2020 నవంబర్ నెలలో ముక్కమల్ల పందెం లో పాల్గొని మొదటి బహుమతి కైవసం చేసుకుని వాటి విజయ ప్రస్థానం మొదలు పెట్టాయి. ఆ సీజన్ లో మొత్తం 46 చోట్ల పాల్గొన్నాయి.ఒక న్యూ కేటగిరి విభాగం లోనే ₹15 లక్షల రూపాయలు బహుమతులు సాధించాయి.
‎ఆ జతను సెట్ చేయడానికి ₹5.75 లక్షలు అయితే మొదటి సంవత్సరం లోనే మూడు రెట్లు బహుమతి సాధించాయి.
‎ఆ తరువాత సీజన్ లో ఓల్డ్ కేటగిరి లో 5 పందాలు ఆడి వెంటనే సీనియర్ లో ఆరంగెట్రం చేసాయి.

సీనియర్స్ లో దండయాత్ర KRBR Brand :


‎2020 నవంబర్ లో న్యూ కేటగిరి లో ప్రదర్శన మొదలు పెట్టి సంవత్సరం తిరగక ముందే 2021 డిసెంబర్ లో సీనియర్ లో ప్రవేశించాయి బోడి గిత్త, బుడ్డ గిత్త.

‎మొదటి పందెం నుంచే విజయయాత్ర ను ప్రారంభించి ఎంత గట్టి పోటీ ఉన్నా మొదటి బహుమతి కైవసం చేసుకుంటూ 5 సంవత్సరాలపాటు సీనియర్ లో ఏ గిత్త తోలనన్ని పంధాలు తొలి 90% మొదటి బహుమతి కైవసం చేసుకోవడం తిరగరాయలేని చరిత్ర.
‎భూపాల్ అన్న గారి నైపుణ్యం గిత్తలను పోసించే విధానం వలెనే ఇన్ని ప్రదర్శనలు చేసాయి.
‎వరసగా ప్రతిరోజూ ఎంతో పోటీ ఉన్న సీనియర్ లో పాల్గొంటు ప్రతి ప్రదర్శన లో మొదటి బహుమతి సాధించడం సామాన్యమైన విషయం కాదు.
‎KRBR (ongole bulls)అనే ఒక బ్రాండ్ గుర్తింపు ని భూపాల్ అన్న గారికి ఇచ్చాయి బోడిగిత్త, బుడ్డగిత్త.

Deaths of precious ongole bulls
Deaths of precious ongole bulls అస్తమిస్తున్న ఆశాకిరణాలు

‎Dvr దీరా తో ప్రయాణం:

‎ఇలా రెండు సీజన్లు జైత్రయాత్ర చేసాక ఈ గిత్తల ప్రతిభను మెచ్చిన ప్రక్యాత పశుపోశకులు dvr memorial అధినేత దేవభక్తుని చక్రవర్తి గారు ఈ జత ను ₹48 లక్షలకు కొనుగోలు చేసి భూపాల్ గారు మరియు వారి టీం ని ఈ జత సారద్యానికి నియమించుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు.
2023 జనవరి 1న కొప్పురావూరు ప్రదర్శన లో RK bulls సింహ గిత్తతో పోటీ పడి రెండవ బహుమతికి పరిమితం అవడంతో, ఎలాగైనా మూడవ సంవత్సరం కూడ మహానంది పోటీలో విజయం సాధించి నంది ని కైవసం చేసుకోవాలనే దృఢ నిశ్చయముతో ఉన్నా చక్రవర్తి గారు ఆలోచనలో పడ్డారు.

జత చీలిక-ధీర తో కలయిక Mahanandi winner:


మూడు సంవత్సరాలనుండి అప్రతిహతంగా జైత్రయాత్ర చేస్తున్న బోడి గిత్త బుడ్డ గిత్తలకు సింహ రూపంలో గట్టి పోటీ ఎదురవడంతో భూపాల్ అన్న గారి సలహా మేరకు జతను విడదీసి అర్జునుడు లాంటి బోడిగిత్త ను, కర్ణుడు లాంటి ధీర గిత్తతో (ఈ గిత్త కథనం త్వరలో) కలిపి జత చేసి శిక్షణ ఇవ్వడంతో సరికొత్త జైత్రయాత్ర మొదలయింది.
Dvr memorial సంస్థానానికి చిరకాల కోరిక అయిన మహానంది హ్యాట్రిక్ ను దీరా తో కలసి సాధించి ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందుంది బోడిగిత్త.
‎ఆ సంవత్సరం కూడా ధీర తో మహానంది, మేళ్లచెరువు లాంటి సెంటర్ పందాలు అన్ని గెలిచి తన ఆధిపత్యాన్ని చూపించింది.

కష్టకాలం లో పడి లేచిన కెరటం:

‎ఆ తరువాతి సీజన్ లో బుడ్డ గిత్తకు కాలు ఫ్యాక్చర్ అవ్వడం. తనను తీర్చిదిద్దిన యజమాని దూరం అవడం వాతావరణ ప్రతికులతలు బోడిగిత్త మనసు, శరీరం నియంత్రణ తప్పేలా చేసాయి.
‎Dvr memorial వారు బోడి గిత్త, బుడ్డ గిత్తలను అమ్మడంతో ఆ గిత్తలు వేరు వేరు యజమానుల దగ్గరకు వెళ్లాయి. ఎంతమంది ప్రయత్నం చేసిన ఆ గిత్తలు మునుపటి ఫామ్ కు తీసుకురాలేక పోయారు.

‎మరొక వైపు భూపాల్ అన్నగారికి ఆ గిత్తల మీద ప్రేమ చావక ఫామ్ కోల్పోయి ఉన్నా మళ్ళీ ఆ గిత్తలను సేకరించి జత చేసారు.
‎కధ మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ జతని మళ్ళీ సెట్ చేసి ఫామ్ లోకి తీసుకురావడం అసాధ్యం అనుకున్నారు అందరూ కానీ పట్టు విడవని సంకల్పంతో గిత్తలను మంచిగా పోషణ చేసి శిక్షణ ఇచ్చి తన జీవితంలో లో నేర్చుకున్న మెలుకువలు ఉపయోగించి మెల్లగా గిత్తలతో బహుమతులు సాధించడం మొదలు పెట్టాడు.
‎2024 నవంబర్ లో జరిగిన ప్రసిద్ధిగాంచిన కొండయ్య స్వామి జక్పాట్ పందెం లో కొద్ది తేడాతో 2వ బహుమతి ₹2లక్షలు సాదించి మళ్ళీ బుడ్డ గిత్త, బోడి గిత్త జైత్రయాత్ర చేయడానికి వచ్చాయి అనే సాంకేతాన్ని పశుపోశకులకి పంపించాయి.
‎తర్వాత ఎన్నో బహుమతులు సాధించి పడి లేచిన కెరటంలా పరిస్థితులకి తలవంచకుండా తన చరిత్ర తానే రాసుకుంది బోడిగిత్త.
‎వయోబారం తో బుడ్డ గిత్త పని తగ్గించాక భూపాల్ అన్నగారు pvsr bulls వారి నల్లమల టైగర్ ను ₹16 లక్షలకు కొనుగోలు చేసి బోడిగిత్త జతగా మరిన్ని ప్రదర్శనలు చేసాడు. ఎన్నో మొదటి బహుమతులు సాధించాడు.

సినిమాల్లో కూడా సాధ్యం కానీ సంఘటనలు ongole bulls :

‎తన కళ్ల ముందే తన సమకాళికులైన గిత్తలు ఫిల్డ్ నుంచి కనుమరుగవుతున్నా బీష్మడిలా పోరాడుతు
‎2021 లో సీనియర్ లో మొదలు పెట్టిన ప్రయాణం 2025 ఏప్రిల్ నెలలో కూడా తన పరక్రమం ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది మదమంచిపాడు సీనియర్ ప్రదర్శన.
‎2025 లో మహానంది గెలిచి ఎవరూ తాకలేని ఫామ్ లో ఉన్న జత (jr గాండీవ, వీర నరసింహ రెడ్డి).
‎బోడి గిత్త తనకంటే వయసులో ఎంతో చిన్న గిత్త అభిమన్యుడి లాంటి బీరం బుల్స్ సాంబ గిత్తతో జతకట్టినది. బోడిగిత్త సీనియర్ లో prime time లో వీర విహారం చేస్తున్నప్పుడు, సాంబ గిత్త నాలుగు పళ్ళలో ఉన్న పసి బాలుడు.
‎మదమంచిపాడులో ఈ జతల మధ్య హారహోరిగా జరిగిన ఆ మహా సంగ్రామం చూసిన ప్రేక్షకులును మంత్ర ముగ్దలను చేసింది. కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు పగ్గాల సారదిగా నిజంగా శివ తాండవం చేసాడు.
‎బోడిగిత్త, సాంబ విజయం సాధించాయి.

Ongole Bull Race
ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనలు విశిష్టత- The Craze of Ongole Bull Race

ఏ గిత్తతోనైనా జతగా:

‎లెజెండరీ బోడి గిత్త  జతకి ఏ గిత్తని కట్టినా, ఆ గిత్తకి తగ్గట్టు తోలింది .
‎దీరాకి తగ్గట్టు స్పీడ్ గా, బుడ్డ గిత్త తో నిదానంగా,
‎నల్లమల టైగర్ తో average గా,  సాంబ తో ఫాస్ట్ గా… పాదరస బరవడి నరనరమే..అనే మాటకి నిలువెత్తు నిదర్శనం.
‎తన జీవితం మొత్తం లో 400 పైగా ప్రదర్శనలు చేసి లెక్కలేనన్ని విజయాలు కైవసం చేసుకుంది బోడిగిత్త.
‎తాను అడుగు పెట్టని బరి లేదు, తాను లాగని బండ లేదు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక ప్రాంతాలలో తన విజయ యాత్ర చేసి చరిత్ర లో మరి ఏ గిత్త కి సాధ్యం కానీ కిర్తి ప్రతిష్టలు సాధించింది.

‎ఇది కల్పిత కధ కాదు చరిత్ర స్టష్టించిన నిజమైన యోధుడి కధ.
‎మీ ఆలోచనలు కామెంట్ రూపంలో తెలుపగలరు.
‎By Madhu ongolebullrace.com

 

2 thoughts on “The Great Ongole Bull- బోడిగిత్త”

  1. Okko company ki okko gitta charithra vundi and vati alanapalanakuda mamulukadu chanti pillani saki natu sakdam ante mamulu vishayakadu oka jatha nu pechalanate anto karchu avuthudi rk vallai simha dvr dheera and krbr ki bodidhi buddahi and brkr ki veeranasimha reddy
    And garikapati sridhar gari chatrapathi
    And mana kasarneni raja chowdary anna gari tyagi simha and present vari adhvaryalo vunna vugrateja jr abhayath and mxor machaapuli karamjaya lanti gittalu adina govt kuda manchi support ichi mana ongole gittalaki amina cheyyali anna malanti vallaki vatini pechalani vunna pettubadi leka aguthunnam kani vati mida prema matram appatiki Alalne vuntundi

    Reply

Leave a Comment