ఒంగోలు జాతి బల ప్రదర్శనలు(Ongole Bull Race), సినిమాలకి కానీ, క్రికెట్ మ్యాచ్ లకి కానీ ఏమాత్రం తీసిపోని వారసత్వ గ్రామీణ క్రీడ.
ఒంగోలు గిత్తలను కన్న బిడ్డలకంటే ప్రేమగా చూసుకునే రైతులు. ఎన్ని పనులున్నా అపుకుని ప్రదర్శనలు తిలకించే ప్రేక్షకులు. వ్యయప్రయాసలకు ఓర్చి ప్రదర్శనలు నిర్వహించే నిర్వాహకులు.
అభిమానం కాదు… ఆరాధన:
ఇక్కడ ప్రతి గిత్తకి, ప్రతి రైతుకి, ప్రతి కంపెనీ కి అభిమానులు ఉంటారు, కాదు కాదు వీరాభిమానులు ఉంటారు. వారి అభిమాన జత గెలిస్తే వారే గెలిచినట్లు ఆనందపడతారు.
ఇక్కడ సాధారణ రైతు నుంచి, గొప్ప గొప్ప వృత్తుల్లో స్థిరపడిన వాళ్లు గిత్తల్ని పోసిస్తూ పోటీల్లో పాల్గొంటారు.
హీరోల కంటే ఎక్కువగా అభిమానించే రధ సారదులు(Ongole Bull Race Riders) జిల్లెల నాగిరెడ్డి గారి నుంచి కుందురు రాంభూపాల్ రెడ్డి గారి వరకు ఎంతోమంది ఉన్నారు.
గిత్తల విలువ(Price Of Ongole Bulls):

మేలు జాతి ఒంగోలు గిత్తల విలువ వెళ్లకట్టలేనిది. బ్రెజిల్ దేశం లో వేలం పాట(auction) లో ఒక ఒంగోలు జాతి ఆవు 41 కోట్ల రూపాయలు పలికింది అంటే, ఈ జాతి కి ఉన్న విలువ అర్ధం చేసుకోవచ్చు.
తెలుగు రాష్టాలలో కూడా ఒంగోలు జాతి గిత్తలకి మంచి డిమాండ్ ఉంది. మంచి వయసులో ఉన్న ఒక గిత్త విలువ దాని పనితనాన్ని బట్టి ₹5 లక్షలు నుంచి ₹1కోటి వరకు పలుకుతుంది.
4పళ్ళలో ఉన్న చిన్న దూడలు కూడా ₹20 లక్షలు పలికిన సందర్భాలు ఉన్నాయి.
పోటీతత్త్వం, పణాళికలు, వ్యూహాలు:
ఒంగోలు జాతి ప్రదర్శనల్లో (Ongole Bull Race) ఎంతో పోటీ ఉంటుంది. సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాదించాలి అంటే ఎంతో ప్రణాళిక, సరైన వ్యూహం అవసరం. ఉదాహరణ కి మహానంది ప్రదర్శన లో మొదటి బహుమతి సాదించాలి అని లక్ష్యం పెట్టుకున్న పశుపోశకుడికి సంవత్సరం ముందు నుంచే ప్రణాళిక వేసి, సరైన జతని సేకరించి వాటిని కలిపి శరీరం ధ్రుడంగా అయ్యేలా పోషణ మరియు వ్యాయామం ఇవ్వడం. జతని కలిపి శిక్షణ ఇచ్చి కొన్ని ప్రదర్శనల్లో పాల్గొని తప్పులు సరిచేసుకోవడం.ఆరోగ్యం పరంగా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం. ప్రదర్శన రోజు డ్రా కి అనుగుణంగా ఆహారం నీరు ఇచ్చి, కోర్టు తీరుని బట్టి అప్పటికప్పుడు వ్యూహాలు రచించి వాటి విజయవంతం గా అమలు పరిచ్చినప్పుడే మొదటి బహుమతి వరిస్తుంది.
మహారథులు – మరువలేని కోర్టులు:
హేమ హేమీ జతలు తలపడే సెంటర్ కోర్టులు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఈ కోర్టు లో ప్రైజ్ సాదించాలి అనే మహానంది, మేళ్లచెరువు లాంటి కోర్టులు ఎన్నో.
ఇక్కడ నిజమైన బావోద్వేగాలు ఉంటాయి. కృషి, పట్టుదల, ఓర్పు ఉంటాయి.సంవత్సరాల తరబడి సాధనలు ఉంటాయి.విజయానంధాలు ఉంటాయి, ఓటమి నిరుత్చాహాలు ఉంటాయి.
ఇక్కడ రికార్డులు ఉంటాయి ఆ రికార్డులు బ్రేక్ చేసే సత్తా ఉన్న గిత్తలు ఉంటాయి.
ఇక్కడ చరిత్ర సృష్టించిన గిత్తలు ఉంటాయి, చరిత్ర చరపలేని సంఘటనలు ఉంటాయి.
ఇది పశుప్రేమికుల స్వర్గధామం (The Paradise)
ప్రభుత్వ ప్రోత్సాహం:
ప్రభుత్వ పరంగా ఆవులు, గేదెలు ఇతర పశువులు పెంచడానికి కొన్ని సబ్సిడీలు మరికొన్ని పథకాలు ఉన్నా, మన దేశానికి గర్వ కారణం అయిన ఒంగోలు జాతి ని వృద్ధి చేయడానికి సరైన శ్రద్ద, ప్రణాళిక, ప్రోత్సాహం లేదు అనే చూపొచ్చు.
ఒంగోలు జాతి ప్రదర్శనలు(Ongole Bull Race) అధికారికంగా ప్రభుత్వం తరుపున నిర్వహించడం, పశుపోశకులకు విలువైన గిత్తలకు తగినట్టు భీమా కల్పించడం, పోషణ ఖర్చులకు సబ్సిడీ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఈ జాతిని మరింత మంది రైతులు పోసించి ప్రదర్శన లో పాల్గొనే విధంగా ప్రోత్సాహం అధించవచ్చు.
పశువైద్యం ప్రాధాన్యత:
సోషల్ మీడియా, యూట్యూబ్ లైవ్స్ కారణంగా ఈ ప్రదర్శనలు(Ongole Bull Race) ఇప్పుడు మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. ఈ నేపథ్యంలో గిత్తల ఆరోగ్య అవసరాలు కూడా పెరిగాయి. విలువైన గిత్తలకు కష్ట కాలంలో వైద్యం చేసే వైద్యులు,వైద్యం అందించే సదుపాయాలు రాష్ట్రం లో లేవనే చెప్పాలి.
ఒక్క RK Bulls అనే ఫార్మ్ ఈ సంవత్సరంలో ₹2 కోట్ల విలువైన 5 గిత్తలను కోల్పోయింది.
ఈ పశువైద్యం మీద కూడా ప్రభుత్వం ద్రుష్టి పెడితే రైతులకు ఎంతో మేలు చేసినవారు అవుతారు.
ముగింపు(The Conclusion):
మొత్తంగా చూస్తే, ఒంగోలు జాతి ప్రదర్శనలు(Ongole Bull Race) కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు – ఇది మన గ్రామీణ సంస్కృతి, రైతుల కష్టం, పశుప్రేమ మరియు సంప్రదాయాల ప్రతిబింబం. ప్రతి గిత్త వెనుక ఉన్న శ్రమ, ప్రతి రైతు చూపించే అంకితభావం, ప్రతి పోటీ వెనుక ఉన్న ప్రణాళిక ఇవన్నీ కలిపి ఈ ప్రదర్శనలను ఒక గొప్ప వారసత్వంగా నిలబెడుతున్నాయి.
ఈ సంప్రదాయం తరతరాలకు నిలవాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం, సరైన పశువైద్య సదుపాయాలు, మరియు యువతలో అవగాహన ఎంతో అవసరం. రైతులకు తోడ్పాటు అందిస్తూ, ఒంగోలు జాతి విలువను కాపాడుతూ ముందుకు తీసుకెళ్తే, ఈ క్రీడ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుతుంది.
మనందరం కలిసి ఈ వారసత్వాన్ని సంరక్షించాలి, ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇది కేవలం పోటీ కాదు… ఇది మన గౌరవం, మన గుర్తింపు.




