Rules & Regs of Ongole bulls competitions.
ఒంగోలు జాతి గిత్తల బండలాగుడు ప్రదర్శన – నియమ నిబంధనలు
ఈ క్రింది నియమ నిబంధనలు అఖిల భారత ఒంగోలు జాతి పశుపోషక సంఘం అధ్యక్షులు మరియు సభ్యుల సమక్షంలో రూపొందించబడినవి.
Understanding the Rules & Regs is essential for every participant.
Understanding the Rules & Regs for Participation
విభాగాలు (Categories):
1. సీనియర్స్ (Seniors):
క్రింది ఏ విభాగం నుంచి అయినా ఒకసారి సీనియర్స్ విభాగంలో ప్రవేశించిన గిత్తలు, జీవితకాలం మొత్తం సీనియర్స్ విభాగంలోనే పాల్గొనాలి. తిరిగి ఇతర విభాగాలకు అనుమతి లేదు.
2. జూనియర్స్ (Juniors):
సబ్ జూనియర్స్ విభాగంలో 1 సంవత్సరం పాల్గొన్న తరువాత జూనియర్స్ విభాగంలోకి ప్రవేశించాలి. ఈ విభాగంలో అనేక సంవత్సరాలు పాల్గొనవచ్చు.
3. సబ్ జూనియర్స్ (Sub Juniors):
న్యూకేటగిరి విభాగంలో 1 సంవత్సరం పూర్తయిన తరువాత సబ్ జూనియర్స్‌లోకి ప్రవేశిస్తారు.
4. న్యూకేటగిరి (New Category):
గిత్తకు మొత్తం 8 పళ్లు వచ్చిన తరువాత ఈ విభాగంలో పాల్గొనాలి. ఇతర క్రింది విభాగాలలో పాల్గొనడానికి అనుమతి ఉండదు.
బలం తక్కువగా ఉందని భావిస్తే 1 లేదా 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవచ్చు.
5. ఆరు పళ్లు (6 Teeth):
పాల పళ్లు ఊడి 6 పళ్లు వచ్చిన గిత్తలు ఈ విభాగంలో పాల్గొనవచ్చు.
(ఈ విభాగంలో 2, 4 పళ్ళు గిత్తలు కూడా అనుమతించబడతాయి.)
6. నాలుగు పళ్లు (4 Teeth):
4 పళ్లు వచ్చిన గిత్తలు ఈ విభాగంలో పాల్గొనవచ్చు.
(ఈ విభాగంలో 2 పళ్ళు గిత్తలు కూడా అనుమతించబడతాయి.)
7. రెండు పళ్లు (2 Teeth):
2 పళ్లు వచ్చిన గిత్తలు ఈ విభాగంలో పాల్గొనవచ్చు.
(పాల పళ్ళు గిత్తలు కూడా పాల్గొనవచ్చు.)
8. పాల పళ్ళు (Milk Teeth):
పాల పళ్ళ దశలో ఉన్న గిత్తలు మాత్రమే ఈ విభాగంలో పాల్గొనాలి.
సమయం (Time Limits):
సీనియర్స్: 25 నిమిషాలు
(కొన్ని ప్రాంతాలలో – రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక – 20 నిమిషాలు)
జూనియర్స్: 20 నిమిషాలు
సబ్ జూనియర్స్: 20 నిమిషాలు
న్యూకేటగిరి: 20 నిమిషాలు
6 పళ్లు: 15 నిమిషాలు
4 పళ్లు: 15 నిమిషాలు
2 పళ్లు: 10 నిమిషాలు
పాల పళ్ళు: 10 నిమిషాలు
సాధారణ నియమాలు (General Rules):
ప్రదర్శనలో నాలుగు చార్నకొలులు మాత్రమే ఉపయోగించాలి.
గిత్తతో తోక పట్టడం, చేతితో నెట్టడం, కర్రతో కొట్టడం పూర్తిగా నిషేధం.
రిఫరీ విజిల్ ఇచ్చిన తరువాత ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఆ తరువాత:
కాడి విరిగినా
పట్టెడలు తెగినా
గొలుసు తెగినా
రాడ్డు వంగినా
ఇవన్నీ కేటాయించిన సమయం లోపలే సరి చేసుకోవాలి.
అదనపు సమయం ఇవ్వబడదు.
బండ సైడ్ లైన్ దాటితే, మొత్తం లాగిన దూరం నుండి కొలతలు తగ్గించబడతాయి.
కొన్ని ప్రాంతాలలో (రాయలసీమ, తెలంగాణ, పశ్చిమ ప్రకాశం)
సైడ్ లైన్ టచ్ అయిన వెంటనే జతను డిస్క్వాలిఫై (Cross) చేస్తారు.
ప్రతి ప్రదర్శన రిఫరీలు, న్యాయ నిర్ణేతలు మరియు నిర్వహణ కమిటీ సమక్షంలో జరుగుతుంది.
వారి నిర్ణయమే తుది నిర్ణయం.